test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మా ఇంటి బంగారం’ కు సెన్సార్ అభినందన

2 గంటల క్రితం

samanta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 09:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత,రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’.సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 19న విడుదల కాబోతోంది.ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు మేకర్స్‌ను అభినందించారు. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం ఈనెల 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే సమంత ఈ సినిమా గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు.తాజాగా ఇన్ స్టాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ ఈ మూవీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.ప్రేక్షకులు పెట్టే డబ్బు, వెచ్చించే సమయం ఇలా అన్నింటికీ న్యాయం చేసేలా సినిమా ఉంటుందని టీం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఓం ప్రకాష్ కెమెరామెన్‌గా,ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పని చేశారు. అన్ని తరగతుల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ సినిమా19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో శ్రీముఖి,గౌతమి,ఆనంద్,లక్ష్మి,శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుష,దిగంత్,గుల్షన్ దేవయ్యలు ముఖ్య పాత్రలు పోషించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్