విభిన్న కథలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘మల్లేశం’, ‘బలగం’ చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించిన ఆయన, గత ఏడాది వచ్చిన ‘కోర్ట్’ మూవీతో మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ‘సుయోధన’ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘సేవ్ ది టైగర్స్-3’ వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రియదర్శి, త్వరలో సుకుమార్‌కు చెందిన ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రియదర్శికి సుకుమార్ ఛాన్స్?
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 12, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)