పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సమాజంలో మనం చూసే యాచకుల వెనుక ఉండే కొన్ని నిజ జీవిత సంఘటనలు, బలమైన భావోద్వేగాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పూరి జగన్నాథ్ తెలిపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి టబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, హీరోయిన్‌గా సంయుక్త నటిస్తున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
‘స్లమ్‌డాగ్’ మేకింగ్ వీడియో విడుదల
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 12, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)