సింగిల్స్ లో లక్ష్యసేన్, సింధు ఓటమి
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్: సింగపూర్ ఓపెన్ సింగిల్స్ లో భారత పోరాటం ముగియగా.. డబుల్స్ లో సాత్విక్-చిరాగ్, ధృవ్ కపిల-తానీషా కాస్ట్రో జంట సెమీస్ కు చేరారు. 4వ సీడ్ గా బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కాంగ్ ఖాయ్ గ్జింగ్ – అరోన్ తాయ్ (మలేషియా) జోడీని చిత్తు చేసింది. తొలిసెట్‌ను 19-21తో కోల్పోయిన సాత్విక్ – చిరాగ్ రెండో సెట్‌లో పుంజుకొని ప్రత్యర్థికి షాకిచ్చారు. 21-17తో సెట్‌ను కైవసం చేసుకొని.. నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ 21-13తో ముగించి సెమీస్ కు చేరారు. ఇక మిక్స్ డ్ డబుల్స్ లో ధృవ్ కపిల-తానీసా కాస్ట్రో జంట తొలి గేమ్ లో 16-18 పాయింట్లతో 3వ ర్యాంక్, అమెరికా జంట చెన్-టో జంట కంటే వెనుకబడి ఉన్న దశలో గాయంతో ప్రత్యర్ధి జంట టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో భారత మిక్స్ డ్ జంటకు సెమీస్ బెర్త్ ఖాయమైంది. ఇక మహిళల సింగిల్స్ లో సింధు 17-21, 14-21తో టాప్ సీడ్, కొరియాకు చెందిన సె-యంగ్-అన్ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది. ఇక పురుషుల సింగిల్స్ లో యువ షట్లర్ లక్ష్యసేన్ మూడు సెట్ల హోరా హోరీ పోరులో పరాజయాన్ని చవిచూశాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఆ మ్యాచ్ లో లక్ష్యసేన్ 19-21, 21-15, 15-21తో వాటనాబే(జపాన్) చేతిలో ఓడాడు.








కామెంట్‌లు (0)