ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బెంగళూరులోని కంఠిరవ స్టేడియం వేదికగా ఈనెల 25 నుండి 28 వరకు జరిగిన 8 వ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2026 లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు సత్తా చాటారు. అక్టోబర్ లో జరుగబోయే ఆషియన్ గేమ్స్ కు ఎంపికల కోసం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన కిల్లక లలిత (టి.11) 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు లో గోల్డ్ మెడల్స్, కరణం గౌతమ్ (టి-12) లాంగ్ జంప్ లో సిల్వర్, 100 మీటర్లు పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించగా, కొత్తింటి పైడి.రాము (ఎఫ్-51) డిస్కస్ త్రో లో బ్రాంజ్ మెడల్ తో సత్తా చాటారు. అంతర్జాతీయ ర్యాంక్ ల ప్రకారం ఆషియన్ గేమ్స్ కు ఎంపికైన వారి వివరాలు త్వరలో తెలియనున్నాయని జిల్లా పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కె .దయానంద్ తెలిపారు. అంతర్జాతీయ వేదికపై జిల్లా పేరు మారుమోగించిన ఈ ముగ్గురికి అభినందనలు తెలిపారు. ఆషియన్ గేమ్స్ కు ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ లో విజయనగరం క్రీడాకారుల సత్తా
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 29, 2026, 11:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)