న్యూఢిల్లీ : ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పాల్గొనడాన్ని అనుమతిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యు ఎఫ్ ఐ )దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. తదుపరి పరిణామాలను అనుసరించి ఈ పిటిషన్ నిష్ప్రయోజనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ పిటిషన్ కొట్టివేయడంతో డబ్ల్యుఎఫ్ ఐకి వ్యతిరేకంగా హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఆమోదించినట్లుగా భావించకూడదని జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎంపిక ట్రయల్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, వాటిలో వినేష్ పాల్గొన్నారని, దీంతో ఈ పిటిషన్ నిష్ప్రయోజనకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్ లో పాల్గొనేందుకు వినేష్ ఫోగట్ కు అనుమతినిస్తూ మే 29న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. క్రీడా సంస్థలు, అథ్లెట్లు, క్రీడాకారులకు సంబంధించిన వివాదాలను వేగవంతమైన, విస్తృతమైన న్యాయపరమైన జోక్యం కొన్ని సార్లు పరిస్థితిని తీవ్రతరం చేయగలవని హెచ్చరించింది.
వినేష్ పై డబ్ల్యు ఎఫ్ ఐ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)