న్యూఢిల్లీ : రెజ్లర్ వినేష్ ఫోగట్ సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. మే 30న జరగనున్న ఆసియా గేమ్స్ 2026 సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు వినేష్ ఫోగట్ కు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. గతంలో రెజ్లింగ్ లో పలుమార్లు దేశానికి గర్వకారణంగా నిలిచిన వినేష్ కి ఒక అవకాశం కల్పించాల్సి వుందని జస్టిస్ పి.ఎస్.నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆమె ట్రయల్స్‌కు హాజరు కాలేదని, ఆమె ఆచూకీ తెలియలేదని విచారణ సమయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యు ఎఫ్ ఐ) వాదించింది. ఆమె తల్లి అయ్యారని, హర్యానా ఎమ్మెల్యేగా తన విధుల్లో నిమగ్నమై ఉన్నారని ఫోగట్ తరపున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ పేర్కొన్నారు. ఆమె మొదటి సారి తల్లి అయ్యారని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం వినేష్ ఫోగట్ కేవలం సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కోసమే ప్రయత్నిస్తున్నారని మాధవి దివాన్ తెలిపారు. ” ఏవ్యక్తికైనా ముందు దేశమే ప్రధానమన్న కోర్టు వాదనతో ఆమె ఏకీభవించారు.
ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ లో వినేష్ ఫోగట్ పాల్గొనడానికి మే 22న ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రసూతి అనంతరం రెజ్లింగ్ లోకి తిరిగి ప్రవేశిస్తున్న ఆమె వంటి ప్రముఖ క్రీడాకారిణిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో డబ్ల్యుఎఫ్ఐ ఎంపిక విధానం వివక్షా పూరితంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.








కామెంట్‌లు (0)