ప్రజాశక్తి-కడప అర్బన్ : మునిసిపల్ స్టేడియంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన 50 మందికి పైగా బాక్సర్లు రింగులో తమ ప్రతిభను నిరూపించుకోగా, వారిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఎనిమిది మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 12 నుండి 14 వరకు విజయనగరంలో జరిగే వైభవంగా జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ టోర్నమెంట్‌లో వీరంతా కడప జిల్లా తరపున బరిలోకి దిగనున్నారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గౌస్ బాషా విచ్చేసి ఎంపికైన బాలి బాలికలను అభినందించారు. అసోసియేషన్ కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికైన బాల, బాలికలు జిల్లాకు మెడల్స్ సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ పోటీలకు రెఫరీగా ఆంజనేయులు వ్యవహరించారు. రాష్ట్ర స్థాయికి వెళ్ళు క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేష్ అభినందించారు. విజయం సాధించిన
క్రీడాకారుల వివరాలు
40-43 కేటగిరి జి. చరణ్ సాయి, 43-46 కేటగిరీలో కె.కార్తీక్,49-52 క్యాటగిరిలో సి. రెడ్డి మోనిష్ రావు,52-55 కేటగిరీలో సయ్యద్ ఇమాన్ హుస్సేన్,55-58 క్యాటగిరీలో సాయి చరణ్, 61-64 కేటగిరిలో షేక్. నవాజ్ ఉర్ రెహమాన్, 70 కిలోల పైన విభాగంలో వై.హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో 43-46 కేటగిరిలో ఆర్.జాష్ణవి లత విజేతలుగా నిలిచారు. వీరందరూ కడప జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరపున విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు.








కామెంట్‌లు (0)