
కె.ఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలు
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. లంచ్ విరామం తర్వాత రెండో సెషన్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్ కె.ఎల్ రాహుల్ (60*), వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (63*) ఇద్దరూ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 141 పరుగులుగా ఉంది.
28 ఓవర్లు. భారత్ 112/1
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం ఆట మొదటి రోజు రెండో సెషన్ కొనసాగుతోంది. 28 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. కె.ఎల్ రాహుల్ 48* (81 బంతులు, 7 ఫోర్లు), సాయి సుదర్శన్ 37* (56 బంతులు, 6 ఫోర్లు) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.
భారత్ vs అఫ్ఘానిస్తాన్ ఏకైక టెస్ట్: లంచ్ విరామ సమయానికి భారత్ 96/1
ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి సెషన్‌ను నిలకడగా ముగించింది. ఆటలో 25 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్ (37*), సాయి సుదర్శన్ (32*) నిలకడగా రాణిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ నడుస్తోంది.
తొలి వికెట్ డౌన్
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ కొల్పోయింది. యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 24 పరుగలు చేసి సలీం సఫీ బౌలింగ్లో అఫ్సర్ జజాయ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, కెఎల్ రాహుల్ ఉన్నారు. భారత్ 19 ఓవర్లలో 73 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా..
న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియం వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ సుతార్ అందుకున్నాడు. ఈ వేదికలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే.
టాస్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. వాతావరణం వేడిగా ఉందని, కాలక్రమేణా పిచ్ నెమ్మదించే అవకాశం ఉన్నందున ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. తాను ఈ ప్రాంతానికి సమీపంలో పెరిగానని, స్వస్థలానికి దగ్గరలో టెస్ట్ మ్యాచ్‌కు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. అలాగే ఈ మ్యాచ్‌తో పాటు ముందున్న తొమ్మిది టెస్టులను దృష్టిలో పెట్టుకుని సరైన కాంబినేషన్లను పరీక్షిస్తున్నామని వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తరఫున ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్ నంగేయాలియా ఖరోటే అరంగేట్రం చేస్తున్నాడు.
భారత్ జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, బి సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మనవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
అఫ్గానిస్థాన్ జట్టు
సెదీకుల్లా అతల్, రహ్మనుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అఫ్సర్ జజాయ్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియౌర్ రెహ్మాన్, మహ్మద్ సలీమ్.








కామెంట్‌లు (0)