మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ లో ముగిసిన భారత షట్లర్ల పోరు
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్ కు చేరిన ఏకైక షట్లర్ అస్మిత్ చాలీహా 8వ ర్యాంకర్, డెన్మార్క్ కు చెందిన లినే కరెస్ ఫెల్డ్ కు గట్టి పోటీనిచ్చి పరాజయాన్ని చవిచూసింది. 23-21తో తొలి గేమ్ నెగ్గినా.. ఆ తర్వాత రెండు గేమ్ లను, 18-21, 11-21తో చేజార్చుకొని ఓటమిపాలైంది. ముఖ్యంగా రెండో గేమ్ లో ఒక దశలో 10-5 పాయింట్లతో ఆధిక్య తలో నిలిచినా.. అనంతరం 13-13పాయింట్ల తో స్కోర్ సమమైం ది. ఈ క్రమంలో రెండో గేమ్ చేజిక్కించుకొనేం దుకు చివరి వరకు పోరాడిన అస్మిత్ ఆ గేమ్ ను 18-21తో చేజార్చుకొని ఒత్తిడికి గురైంది. నిర్ణయాత్మక మూడో, చివరి గేమ్ లో డెన్మార్క్ స్టార్ తన అనుభవన్నంతా రంగరించి ఆ గేమ్ ను 21-11తో చేజిక్కించుకొని మ్యాచ్ ముగించింది.








కామెంట్‌లు (0)