test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముజఫర్‌పూర్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

4 రోజుల క్రితం

fire accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 09:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం


ముజఫర్‌పూర్ : ఉత్తర బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రసాద్ ఆసుపత్రి ఐదవ అంతస్తులో తెల్లవారుజామున 3:55 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐసీయూలో ఉన్న సుమారు 15 మంది రోగులను సురక్షితంగా బయటకు తరలించారు. మిగిలిన రోగులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారి రామ్ నివాస్ పాండే మాట్లాడుతూ, మంటలను అదుపులోకి తెచ్చి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చామని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం సూచిస్తోందన్నారు.

జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోగుల కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా, జూన్ 3న ఢిల్లీలోని మాల్వీయా నగర్ ప్రాంతంలో జరిగిన మరో భారీ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన మరువకముందే ఈ విషాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్