test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే

4 రోజుల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 12:23 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బొద్దింకల పార్టీ డిమాండ్‌

  • నిరసనకు ఢిల్లీ రానున్న అభిజిత్ దీప్కే

  • మద్దతు తెలిపిన వాంగ్‌ ‌చుక్‌

​న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందేనని సోషల్‌ ‌మీడియా సంచలనం కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) మరోసారి డిమాండ్‌ చేసింది. ఈ శనివారం నాడు (6వ తేదీ) జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి యువత తరలిరావాలంటూ పిలుపునిచ్చింది. బుధవారం నాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో పరిశోధనాత్మక పాత్రికేయుడు, సిజెపి ప్రధాన ప్రతినిధి సౌరవ్‌ ‌దాస్‌ మాట్లాడుతూ.. ‘అభిజిత్ దీప్కే జూన్ 6 ఉదయం 8 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. విమానాశ్రయానికి వచ్చి ఆయనకు స్వాగతం పలకాలని మద్దతుదారులను కోరుతున్నాను. అనంతరం వాంగ్‌చుక్ జీతో కలిసి పార్లమెంట్ స్ట్రీట్‌కు వచ్చి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి కోరతాము. ఈ నిరసనలో భాగం కావాలని అన్ని రాజకీయ పార్టీలను మేము ఆహ్వానిస్తున్నాము’ అని తెలిపారు.

మద్దతు తెలిపిన వాంగ్‌‌ చుక్

విద్యా సంస్కర్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌ చుక్ జూన్ 5లోగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, జూన్ 6న ఢిల్లీలో జరిగే నిరసనలో తాను పాల్గొంటానని ప్రకటించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల అమలు, దాని ప్రస్తుత స్థితిపై తనకున్న ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాంగ్‌ చుక్ పేర్కొన్నారు. అనంతరం విడుదల చేసిన వీడియో సందేశంలో ‘సిజెపి నాయకులతో మాట్లాడిన తర్వాత, వారికి ఎటువంటి తప్పుడు ఉద్దేశాలు లేవని, వారు అత్యంత దేశభక్తులని నేను నిజంగా భావించాను. వాస్తవానికి, దేశాన్ని మెరుగుపరచడానికి వారు త్యాగం చేస్తున్నారు’ అని వాంగ్‌ చుక్ అన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. జవాబుదారీతనం కోరుతూ, ‘ఆత్మగౌరవ ప్రజాస్వామ్యంలో’, అటువంటి వైఫల్యాలు సంభవించినప్పుడు విద్యా మంత్రులు రాజీనామా చేయాలని వాంగ్‌ చుక్ స్పష్టం చేశారు. సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ ‘సోనమ్ వాంగ్‌ చుక్ కాక్రోచ్ ఉద్యమంలో చేరారు! ఉద్యమంలో చేరినందుకు ధన్యవాదాలు. ఇది మా కాక్రోచ్‌లందరికీ గొప్ప గౌరవం! జూన్ 6న మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాను. జై హింద్’ అంటూ సోషల్‌ ‌మీడియా ఎక్స్‌‌లో తెలిపారు.

అరెస్ట్‌ ‌చేస్తారా?

అభిజిత్ దీప్కే శనివారం నాడు ఢిల్లీ రానున్న నేపథ్యంలో పోలీసులు, బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ పెద్దలు అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొద్దింకల పార్టీ ఎక్స్‌ ‌ఖాతాను నిలిపేసిన సంగతి తెలిసిందే. బిజెపి నాయకులు.. సిజెపి వెనకాల విదేశీ హస్తం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే వీటిని సోషల్‌ ‌మీడియా వేదికగా యువత అడ్డుకున్నారు. కానీ అభిజిత్ దీప్కేను ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే అరెస్టు ‌చేసే అవకాశం ఉందని, దీంతో శనివారం జరిగే బొద్దింకల పార్టీ నినసనపై సర్వత్రా ఆసక్తి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్