test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మరోసారి నీట్ పరీక్ష రాయలేనంటూ విద్యార్థిని ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

3 రోజుల క్రితం

she-could-not-appear-in-the-neet-exam-came-to-light-late
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 05:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భోపాల్ : మరోసారి నీట్ పరీక్ష రాయలేనంటూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. గత నెల 20న జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలప్రకారం.. మధ్యప్రదేశ్ మావ్‌గంజ్ జిల్లాలోని మగానియా గ్రామానికి చెందిన ఆకాంక్ష చతుర్వేది (18) డాక్టర్ కావాలని కలలు కంది. తన కలను నిజం చేసుకునేందుకు నాగ్ పూర్ లోని కోచింగ్ సెంటర్ లో నీట్ కోసం ప్రిపేరైంది. ఆమెకు సహాయంగా ఉండేందుకు తల్లిదండ్రులు కూడా అక్కడే జీవనోపాధి వెతుక్కున్నారు. తండ్రి వ్యవసాయం చేస్తూ, వంటలు కూడా చేసేవాడు. ఆమె చదువు కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పై రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అలాగే, బంధువుల నుంచి కూడా కొంత అప్పుగా తీసుకున్నారు. ఆకాంక్ష కూడా గత నెల 3న జరిగిన పరీక్షకు హాజరైంది. పరీక్ష బాగా రాశానని, తనకు మంచి మార్కులు వస్తాయని పరీక్ష అనంతరం తన బంధువులు, సన్నిహితులకు చెప్పింది. అయితే, వారం రోజులకే నీట్ పేపర్ లీకైందన్న ఆరోపణలతో ఎన్ టి ఎ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురై గత నెల 20న తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తనకు మళ్లీ నీట్ పరీక్ష రాసేంత శక్తి లేదని, తల్లిదండ్రుల ఆకాంక్షలకు నెరవేర్చలేకపోతున్నానని, వారికి క్షమాపణలు అంటూ సూసైడ్ లేఖలో పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్