బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కి అసంతృప్తి సెగ తగిలింది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ తో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామలింగా రెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. తనకు కేటాయించిన శాఖ పట్ల అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. తాను బెంగళూరు అభివృద్ధి శాఖను కోరానని, కానీ తనకు నీటి పారుదల ప్రాజెక్టుల శాఖను కేటాయించారని అన్నారు. తన అంతరాత్మకు విరుద్ధంగా తాను పనిచేయలేనని, ఈ అవమానాన్ని ఎంతకాలం భరించగలనని అన్నారు. ప్రస్తుతం తన ముందున్న మార్గం ఇదేనని అన్నారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి శాఖల కేటాయింపు తర్వాత ఈ రాజీనామా జరిగింది. మంత్రిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం యత్నించినప్పటికీ ఫలితం లేనట్లు సమాచారం. పార్టీ నాయకత్వ సూచనలను తాను పట్టించుకోనని, సమయం మించిపోయిందని అన్నారు.
ఈ నెల 3న (బుధవారం) కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు సుమారు 15మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
డి.కె.శివకుమార్ కి అసంతృప్తి సెగ
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)