జైపూర్ : రాజస్థాన్ లో ఎబోలా అనుమానిత కేసు నమోదైంది. ఉగాండా నుండి రాజస్థాన్ వచ్చిన ఒక మహిళలో ఎబోలా వైరస్ లక్షణాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం షార్జా నుండి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆ మహిళకు సాధారణ తనిఖీల్లో వైరస్ లక్షణాలు కనిపించాయని అన్నారు. వెంటనే ఆమెను జైపూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఐసోలేషన్ లో ఉంచామని చెప్పారు. ఆ మహిళ నుండి సేకరింన నమూనాలను పరీక్షల కోసం పూణేలోని ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఎబోలా వైరస్ ఇంకా నిర్ధారణ కాలేదని, నివేదిక అందిన తర్వాతే ఈ ఇన్ఫెక్షన్‌ను నిర్ధారించగలమని రాజస్థాన్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సూపరింటెండెంట్ అనిల్ గుప్తా పేర్కొన్నారు. నివేదిక శనివారం వెలువడే అవకాశం ఉందని అన్నారు.
మరోవైపు గురువారం హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సూడాన్ జాతీయుడిలో ఎబోలా లక్షణాలను గుర్తించారు. ఆ వ్యక్తిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్ప్రతికి తరలించామని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి)కి పంపినట్లు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.
కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందడంతో డబ్ల్యుహెచ్ ఒ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాధి తీవ్రత దృష్ట్యా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణాలను నివారించాలని కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకు సూచించింది.
రాజస్థాన్ లో ఎబోలా అనుమానిత కేసు
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)