test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కువైట్ విమానాశ్రయంపై దాడిలో భారతీయుడు మృతి

4 రోజుల క్రితం

Indian national killed in attack on Kuwait airport
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 12:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దుబాయ్ : కువైట్ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్ పై దాడులు జరిపినప్పటి నుండి ఇప్పటివరకు 10మంది భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. “కువైట్ లోని విమానాశ్రయంపై జరిగిన దాడి కారణంగా ఒక భారతీయుడు మరణించాడు. అతని మృతికి సంతాపాన్ని తెలుపుతున్నాం” అని కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ పోస్ట్ లో బుధవారం పేర్కొంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి మద్దతు, సహకారాన్ని అందిస్తామని పేర్కొంది. తమ మిషన్ కువైట్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికాల మధ్య ఘర్షణలు చెలరేగినప్పటి నుండి, ఈ తాజా మరణంతో భారతీయ మృతుల సంఖ్య కనీసం 10కి చేరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్