న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పిలుపునిచ్చిన ఆందోళనపై పిటిషన్ అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. `సేవ్ ఇండియా’ ఫౌండేషన్ తరపున న్యాయవాది అభ్యర్థనను జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. విచారణకు జాబితా చేసేందుకు బెంచ్ తిరస్కరించింది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి కీలక మౌలిక సదుపాయాలు, అత్యవసర సేవలు పనిచేసేలా చూసేందుకు ఈ ఆందోళనను పరిమితం చేయడానికి , నియంత్రించడానికి లేదా మరో చోటికి తరలించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. విదేశీ సర్వర్ల సహాయంతో, అంతర్జాతీయ కుట్రలో భాగంగా దేశంలో అస్థిరతను సృష్టించడానికి సిజెపి యత్నిస్తోందని ఆరోపించింది. నీట్ -యుజి పరీక్ష సహా పలు పరీక్షల్లో లోపాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో సిజెపి ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సిజెపి చేపడుతున్న ఉద్యమానికి పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ స హా పలువురు మద్దతు ప్రకటించారు.
కాక్రోచ్ `ఆందోళన’పై పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)