వాషింగ్టన్ : అమెరికాలోని కాగితపు కర్మాగారంలో రసాయనాల లీకేజీ జరిగింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని లాంగ్‌వ్యూలో ఉన్న ప్లాంట్‌లోని పదివేల గ్యాలన్ల యాసిడ్ తరహా రసాయనంతో కూడిన భారీ ట్యాంక్ మంగళవారం పేలిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరినట్లు అధికారులు శనివారం తెలిపారు. గల్లంతైన తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీశారని అన్నారు.
నిప్పాన్ డైనావేవ్ ప్యాకేజింగ్ కంపెనీలో తెల్లవారుజామున షిఫ్టులు మారే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో9,00,000 గ్యాలన్ల (3.4 మిలియన్ లీటర్ల) ‘వైట్ లిక్కర్’ నిల్వ ఉన్న భారీ ట్యాంకు ఒక్కసారిగా పేలిపోయిందని అన్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, తొమ్మిది మంది గల్లంతయ్యారని అన్నారు. ఈ ఘటనలో గల్లంతైన తొమ్మిదవ, చివరి ఉద్యోగిని తాము గుర్తించామని లాంగ్‌వ్యూ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఫైర్ చీఫ్ బ్రాడ్ హానిగ్ ఒక విలేకరుల సమావేశంలో తెలిపారు.
వైట్ లిక్కర్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం సల్ఫైడ్‌లను కలిగి ఉండే అత్యంత క్షార ద్రావణం. దీనిని చెక్కలను విచ్ఛిన్నం చేసి, కాగితం తయారీకి అవసరమైన గుజ్జును తయారు చేసుందకు వినియోగిస్తారు.








కామెంట్‌లు (0)