test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మలయాళీల మానవత్వం – రూ.34 కోట్ల క్షమాధనంతో మరణశిక్ష నుండి విముక్తి

29 మే, 2026

The humanity of Malayalis - Freedom from death penalty with a Rs. 34 crore pardon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 29, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోళికోడ్‌ (సౌదీ అరేబియా) : సౌదీ అరేబియా జైల్లో 20 ఏళ్లపాటు శిక్షను ఎదుర్కొని మలయాళీల మానవత్వంతో ప్రాణాలు దక్కించుకున్న అబ్దుల్‌ రహీమ్‌ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బక్రీద్‌ రోజునే స్వస్థలమైన కేరళకు చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బుధవారం రాత్రి సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన రహీమ్‌ గురువారం ఉదయం కేరళలోని కరిపుర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. బంధువులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడి నుంచి కోళికోడ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. స్నేహితులు, గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అసలేం జరిగిందంటే …. బతుకుదెరువు కోసం 2006లో సౌదీ వెళ్లిన రహీమ్‌ అక్కడ ఒక దివ్యాంగ బాలుడికి కేర్‌టేకర్‌గా చేరారు. ప్రమాదవశాత్తు ఆ బాలుడు మరణించడంతో రహీమ్‌పై కేసు నమోదైంది. సౌదీ కోర్టు రహీమ్‌కు మరణశిక్ష విధించింది. క్షమాభిక్ష పెట్టడానికి బాలుడి కుటుంబం నిరాకరించడంతో 2018లో సౌదీ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి సౌదీ చట్టాల ప్రకారం …. దాదాపు 34 కోట్ల రూపాయలు క్షమాధనంగా చెల్లించాల్సి వచ్చింది. రహీమ్‌ ప్రాణాలు కాపాడటానికి ప్రపంచవ్యాప్త మలయాళీ సమాజమంతా కదిలింది. విరాళాల ద్వారా ఆ డబ్బు వసూలుచేసి సౌదీ కోర్టుకు చెల్లించింది. దీంతో ఆయన విడుదల సాధ్యమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్