కొలంబొ : 2019 ఈస్టర్ దాడుల కేసులో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స విదేశీ ప్రయాణంపై శ్రీలంక కోర్టు బుధవారం నిషేధం విధించింది. ఈ కేసుపై విచారణ చేపడుతున్న సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై కొలంబొ ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్ట్ జడ్జి పసన్ అమరశేఖరా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు మాజీ ఆర్మీ కల్నల్ మొహమ్మద్ అన్సార్, మాజీ నిఘా అధికారి ప్రేమానంద ఉదలగమా (అలియాస్ శివ) లపై కూడా విదేశీ ప్రయాణంపై ఆంక్షలు విధించింది. 2019 ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 11మంది భారతీయులు సహా 270మంది మరణించిన సంగతి తెలిసిందే.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్స విదేశీ ప్రయాణంపై నిషేధం
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 05:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)