DRISHYAM
మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలితో సమావేశమైన విదేశాంగమంత్రి

04 జూన్, 2026

EAM Jaishankar meets Venezuela's Acting President
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తో సమావేశమయ్యారు. వెనిజులాతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ రోజు న్యూఢిల్లీలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తో సమావేశం కావడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత్-వెనిజులా సంబంధాల పట్ల ఆమెకున్న దీర్ఘకాల నిబద్ధతను తాము గౌరవిస్తామని అన్నారు. ప్రధాని మోడీతో ఆమె సమావేశం ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం డెల్సీ రోడ్రిగ్జ్ బుధవారం భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్