ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : మా హక్కులను వదులుకోబోం – లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ …. మంగళవారం తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద సత్తి కోదండరామిరెడ్డి అధ్యక్షతన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు సత్తి కోదండరామిరెడ్డి, చిర్ల పుల్లారెడ్డి, కర్రీ సాయి రెడ్డి మాట్లాడుతూ …. బ్రిటిష్ కాలం నుండి కార్మికులు అనేక పోరాటాలు త్యాగాలు ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు గా విభజించిందని వారు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తారీకు నుండి రాష్ట్రాలలో వీటిని అమలు చేయాలని వచ్చినప్పటికీ, మే 4 తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వెంటనే రాష్ట్రాలు ఈ నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. కార్మికుల సాధించుకున్న హక్కులను కార్మికులు వదులుకోరని ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా పోరాడుతారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కార్మికుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం కార్మికుల నెత్తిమీద పిడుగుపాటు వేయడం, సంపన్నులకు వరాలుగా దోచిపెట్టడం చాలా హేయమైన చర్యగా వారు దుయ్యబట్టారు. వెంటనే రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాస్ రెడ్డి , ఎస్వీఎస్ రెడ్డి, బుద్దాల నాని, మద్దాల పుత్రయ్య, కరి సుబ్బిరెడ్డి, అడప ఆంజనేయులు, గాది వెంకటరావు, అడ్డగర్ల కృష్ణ, సత్తి దుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు, యూనియన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మా హక్కులను వదులుకోబోం : కార్మికుల నిరసన
12 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 12, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)