ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మండలంలోని నగుళ్ళు దబ్బగడ్డ నీలాటి రేవు సమీపంలోని మెట్ట వద్ద ఏనుగులు తిష్ట వేశాయి. శుక్రవారం రాత్రి దబ్బగడ్డ గ్రామం పొలాలు మీదుగా అడారు గడ్డలోనికి ప్రవేశించిన ఏనుగులు శనివారం సాయంత్రం వరకు ఆ పరిసరాల్లోనే సంచరించాయి. ఆడారు గడ్డకు అనుకొని ఉన్న ఓ రైతు పామాయిల్ తోటలో ఉన్న వాటర్ ట్యాంకును ఏనుగులు ధ్వంసం చేశాయి. అలాగే సమీపంలో ఉన్న గిరిజనుల జొన్న పంటను కూడా నాశనం చేశాయి. ఆ డారు గడ్డ సమీపంలో నీటి సదుపాయంతో పాటు మేత కూడా ఏనుగులకు అనుకూలంగా మారడంతో ఈ ప్రాంతంలోనే శనివారం సాయంత్రం వరకు తిష్ట వేసి ఉన్నట్లు అటవీశాఖ బీట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ ఆధ్వర్యంలో ఏనుగుల సంచారం గమనిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ పరిసరాల్లో ఉండే గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నగుళ్ళు మెట్ట సమీపంలో ఏనుగులు తిష్ట
30 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)