test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దప్పికతో పుట్టురు గ్రామం ..!

29 మే, 2026

దప్పికతో పుట్టురు గ్రామం ..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 29, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పార్వతీపురం (మన్యం) : పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పుట్టురు గ్రామం దప్పికతో ఎండిపోతోంది. పార్వతీపురం మండలానికి కూతవేటు దూరంలో ఉన్న పుట్టూరు గ్రామంలో ఉన్న ప్రజలు తాగునీరుకి కష్టాలు పడుతున్నారు. శుక్రవారం ఆ గ్రామస్తులు ప్రజాశక్తికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ఆవేదన అధికారులకు తెలియాలని విన్నవించుకున్నారు. చాలామంది పేద ప్రజలు బోరు బావి లేక, సొంతంగా ఖర్చు పెట్టి బోర్లు తీసుకోలేక తాగునీరు కోసం నానా కష్టాలు అవస్థలు పడుతున్నారు. పేరు గొప్ప, ఊరు దెబ్బ అనే సామెతగా తయారయింది ఆ ఊరు. నేటికీ ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని ప్రజలు అంటున్నారు. చాలా గ్రామాలలో ఇంటింటికి కొళాయిలు వేస్తున్నారు తప్ప తమ ఊరిలో వేయడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామంలో నీళ్లు ట్యాంకు ఉంది కానీ అందులో నీళ్లు లేక, మోటర్ పనిచేయక, పంచాయతీ అధికారులు పట్టించుకోక ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, కూటమి ప్రభుత్వము పట్టించుకొని ఇంటింటి కొళాయిలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్