ముంబయి : రూపాయి విలువను స్థిరీకరించడానికి, వడ్డీ రేట్ల పెంపుతో సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పరిశీలిస్తోందని సంబంధిత అధికారులను ఉద్ధేశించి ‘బ్లూమ్‌బెర్గ్’ గురువారం ఒక నివేదికలో వెల్లడించింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో సహా ఆర్‌బీఐ ఉన్నతాధికారులు వరుస అంతర్గత సమావేశాలు నిర్వహించినట్లు ఈ నివేదిక పేర్కొంది. గడిచిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి అంతర్గతంగా 96.95 వద్ద రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. ఆ తర్వాత కోలుకుని డాలర్‌తో పోలిస్తే 96.86 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటం, ముడి చమురు ధరలు అధికంగా కొనసాగడంతో డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ పరిణామాల వల్లే రూపాయి విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయి, కొత్త ముగింపు రికార్డును నమోదు చేసింది. అయితే, గురువారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి తన సర్వకాలిక కనిష్ట ముగింపు స్థాయి నుండి 41 పైసలు పుంజుకుని అమెరికా డాలర్‌తో పోలిస్తే 96.45కు చేరుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 96.25 వద్ద బలంగా ప్రారంభమై, ఆ తర్వాత స్వల్పంగా తగ్గి 96.45 వద్ద ట్రేడయ్యింది. బుధవారం నాటి ముగింపు ధర 96.86తో పోలిస్తే ఇది 41 పైసల రికవరీని సూచిస్తోంది.
వడ్డీ రేట్ల పెంపుపై ఆర్ బి ఐ కసరత్తు
21 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 21, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)