న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బంగారం ధర భారీగా తగ్గింది. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు మదుపర్లను సురక్షితమైన ప్రత్యామ్నాయంగా భావించే పసిడి పైనా కాకుండా పెట్టుబడులను యుఎస్ డాలర్ వైపు మళ్లించడంతో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర 10 గ్రాములకు రూ.2,800 తగ్గి రూ.1,62,400 వద్ద ముగిసింది. అంతకుముందు సోమవారం ఇది రూ.1,65,200 వద్ద నమోదయ్యింది. అమెరికా-ఇరాన్ చర్చలపై స్పష్టత లేకపోవడంతో మార్కెట్ వర్గాలు కొత్త కొనుగోళ్లు తీసుకోవడానికి వెనుకాడాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ దాదాపు 1 శాతం తగ్గి 4,534.69 డాలర్లకు పడిపోయింది. దేశీయంగా వెండి ధర మాత్రం కిలోకు రూ. 2,000 పెరిగి రూ. 2,73,000 కు చేరుకుంది.
Print Editionబంగారం రూ.2,800 తగ్గుదల
26 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 26, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)