test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య

11 మే, 2026

murde
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 10:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికులను భయాందోళనలకు గురు చేసింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి నాగేశ్వరరావు(46) ను గుర్తు తెలియని వ్యక్తులు రామారావు పేటలో గల రెడ్ క్రాస్ సమీపంలో హత్య చేశారు. రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు దాడి చేసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటన ప్రాంతం, పరిసర ప్రాంతాల పరిస్థితులను పోలీసులు, క్రూస్ టీం పరిశీలించింది. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల కదలికలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్