test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హర్మూజ్‌పై ఇరాన్ కొత్త నిబంధనలు

09 మే, 2026

హర్మూజ్‌పై ఇరాన్ కొత్త నిబంధనలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 12:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : హర్మూజ్‌ జలసంధిపై మరింత పట్టు సాధించేందుకు ఇరాన్ సిద్ధపడింది. సొంతంగా కొన్ని నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. పర్షియల్ గల్ఫ్ స్టేట్ అథారిటీ (పిజిఎస్‌ఎ)ని ఏర్పాటు చేసింది. హర్మూజ్‌ మీదుగా ప్రయాణించే వాణిజ్య నౌకలు విధిగా 40 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. నౌకలో ఉన్న సరుకు వివరాలు, దాని యజమాని, సిబ్బంది జాతీయత వంటి ప్రశ్నలను సంధించింది. ఈ నిబంధనను ఉల్లంఘించే నౌకలు క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాక ఆ నౌకలను స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. హార్ముజ్‌లో కొత్త నిబంధనలు తీసుకొస్తామని అమెరికా`ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచే ఇరాన్ చెబుతోంది. దానికి అనుగుణంగానే తాజాగా పిజిఎస్‌ఎను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ అంతర్జాతీయ సముద్రయాన నిబంధనల మేరకు హార్ముజ్‌లో నౌకలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ అమలులోకి తెచ్చిన తాజా నిబంధనల ప్రకారం…నౌకల గుర్తింపు నెంబర్లను, గతంలో వాటి పేర్లను సిపిఎస్‌ఎకు తెలియజేయాల్సి ఉంటుంది.హర్మూజ్‌పై ఇరాన్ కొత్త నిబంధనలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్