test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 3రోజుల కాల్పుల విరమణ : ట్రంప్

09 మే, 2026

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 3రోజుల కాల్పుల విరమణ : ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 3రోజుల కాల్పుల విరమణ : ట్రంప్

వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 12:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 3రోజుల కాల్పుల విరమణ : ట్రంప్

– ఖైదీల మార్పిడికి ఇరు దేశాలు అంగీకారం  

వాషింగ్టన్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణతో పాటు ఖైదీల మార్పిడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మే 9 నుంచి 11 వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని వైట్ హౌస్ వెల్లడించింది. రష్యా విజయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ తరఫు సలహాదారు యూరి ఉషాకోవ్ అంగీకారం తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ఈ చర్య శాంతి దిశగా తొలి అడుగు కావాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం, మే 9 నుంచి 11 వరకు ఇరు దేశాలు అన్ని సైనిక చర్యలను నిలిపివేయనున్నాయి. అదేవిధంగా, ఇరు పక్షాల నుంచి సుమారు వెయ్యి మంది ఖైదీలను పరస్పరం విడుదల చేయడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల ఫలితంగానే ఈ నిర్ణయం సాధ్యమైందని జెలెన్స్కీ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్