బీజింగ్ : చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలకు, అంతర్జాతీయంగా ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారని, ఉమ్మడి అవగాహనకు వచ్చారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం ట్రంప్ బుధవారం చైనా చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం ఆయన జిన్ పింగ్ తో రెండు సార్లు సమావేశమై పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారని అన్నారు. రానున్న మూడేళ్లు, ఆ తర్వాత ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడానికి, వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా-అమెరికా సంబంధాన్ని నిర్మించాలనే నూతన దృక్పథాన్ని అంగీకరించారని అన్నారు. చైనా-అమెరికా సంబంధాల స్థిరమైన, పటిష్టమైన, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే ప్రపంచ శాంతి, శ్రేయస్సు, పురోగతిని తీసుకురావడానికి ఇద్దరు అధ్యక్షులు ఒక అవగాహనకు వచ్చారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత అక్టోబర్ లో జరిగిన బుసాన్ సమావేశం అనంతరం ఇరువురు అధ్యక్షులు మొదటిసారిగా ముఖాముఖీ సమావేశమవడం గమనార్హం. తొమ్మిదేళ్లలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి అని ఆ ప్రకటన తెలిపింది.
అంతర్జాతీయ సమస్యలపై ఇరువురు నేతల విస్తృత చర్చలు : చైనా విదేశాంగ శాఖ
15 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 15, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)