దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీడియా ముందుకు రావడం లేదు. వచ్చనా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం లేదు. తాజాగా నార్వే పర్యటనలోనూ అది మరోమారు స్పష్టమైంది. నార్వే పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని జోనాస్ గార్ స్టోర్ కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఇటువంటి కార్క్రకమాల్లో పాత్రికేయులు సహజంగానే ప్రశ్నలు వేస్తారు. అయితే మోడీ పర్యటనలో దీనికి భిన్నంగా జరిగింది. నేతలిద్దరూ మీడియా ముందు కరచాలనం చేసుకుని, ఫోటోలకి ఫోజు ఇచ్చిన తరువాత ప్రధాని మోడీ వేదికమీద నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో నార్వే పత్రిక ‘డాగ్సావిసెన్’ చెందిన మహిళా జర్నలిస్టు హెల్లె ల్యాంగ్ మోడీని కొన్ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించారు. అయితే, మోడీ నుండి ఎటువంటి స్పందన కనిపించలేదు. దీంతో ‘ప్రపంచంలోని అత్యంత స్వేఛ్చాయుతమైన మీడియా నుండి మీరు ఎందుకు ప్రశ్నలు తీసుకోరు?’ అని ఆమె ప్రశ్నించారు. ఆమె ఈ ప్రశ్న అడగుతుండగానే మోడీ వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ మేరకు విడుదలైన వీడియో క్లిప్పింగ్ వైరల్గా మారింది. మోడీ తీరును నిరసిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. అనంతరం ల్యాంగ్ మాట్లాడుతూ, నార్వేలో విదేశీ నాయకులు వచ్చినప్పుడు సాధారణంగా మీడియాకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. చాలా ప్రశ్నలు కాకపోయినా, కనీసం కొన్ని ప్రశ్నలు అడగనిస్తారు. కానీ మోడీ విషయంలో అలా జరగలేదు’ అని చెప్పారు. తాజాగా విడుదలైన పత్రికా స్వేఛ్చ సూచికలో నార్వే మొదటి స్థానంలో ఉండగా, భారత్ 157 వ స్థానంలో ఉండటం గమనార్హం. దాదాపు 13 ఏళ్లుగా దేశంలోని అత్యున్నత పదవిలో కొనసాగుతున్న మోడీ ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించని విషయం తెలిసిందే. స్వదేశంలోనే మీడియా ప్రశ్నలను ఎదుర్కోని ప్రధాని విదేశాలలో అందుకు సిద్ధపడతారని ఆశించడం అత్యాశే అన్న వ్యాఖ్యలు మీడియా వర్గాల నుండి వినిపిస్తున్నాయి.
నార్వేలోనూ మౌనమే !
21 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 21, 2026, 06:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)