అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో ఎయిర్ షోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఢీకొని రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. ‘గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షో’ ప్రదర్శనలో భాగంగా ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా.. అమెరికా నావికాదళానికి చెందిన రెండు EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు ఒక్కసారిగా పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెండు విమానాల్లో మంటలు చెలరేగాయి. విమానాలు నేలకూలడానికి కొన్ని క్షణాల ముందే వాటిలోని నలుగురు పైలట్లు పారాచూట్ల సహాయంతో సురక్షితంగా బయటపడటంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ దారుణ దృశ్యాలను ఎయిర్ షో చూడటానికి వచ్చిన ప్రేక్షకులు తమ ఫోన్లలో చిత్రీకరించగా, దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బేస్‌ను లాక్‌డౌన్ చేసిన రక్షణ బలగాలు, ఎయిర్ షోలోని మిగిలిన కార్యక్రమాలను రద్దు చేసి, ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి.
ఎయిర్ షోలో ఘోర ప్రమాదం.. గాల్లో ఢీకొని కూలిన రెండు యుద్ధ విమానాలు
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 07:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)