test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసోవియట్‌ ‌విజయ స్పూర్తిని చాటాలి..

09 మే, 2026

సోవియట్‌ ‌విజయ స్పూర్తిని చాటాలి..

సోవియట్‌ ‌విజయ స్పూర్తిని చాటాలి..

వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 12:53 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

సోవియట్‌ ‌విజయ స్పూర్తిని చాటాలి..

  • లక్షలాది మరణాలకు నాజీలే కారణం

  • ఉక్రెయిన్‌‌లో రష్యా సైన్యం దురాక్రమణ శక్తితో పోరాడుతుంది

  • 81 వార్షికోత్సవంలో అధ్యక్షుడు పుతిన్‌ ‌​

మాస్కో: రెండో ప్రపంచ యుద్ధం (1941-1945)లో సోవియట్‌ ‌యూనియన్‌ సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ రష్యా 81వ వార్షికోత్సవాన్ని శనివారం రెడ్‌ ‌స్కేర్‌లో ఘనంగా నిర్వహించింది. యుద్ధంలో మరణించిన సైనికులు, ప్రజలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగిస్తూ “ప్రతినిధులు, మహిళలు, ప్రముఖులు, స్నేహితులపే, విజయ దినోత్సవం సందర్భంగా స్వాగతించడం నాకు చాలా ఆనందంగా ఉంది. స్నేహితులు, నమ్మకమైన భాగస్వాముల సమక్షంలో ఈ సందర్భాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ సోవియట్ ప్రజల వీరత్వాన్ని, నాజీయిజాన్ని మట్టికరిపించిన వారి పోరాట కృషిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారు మన దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని కాపాడారు. సమాజ దుష్టత్వానికి ముగింపు పలికారు, నాజీ జర్మనీకి దుర్మార్గాలకు బలైపోయిన దేశాలకు సోవియట్‌ ‌యూనియన్‌ సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించింది’’ అని పుతిన్‌ ‌పేర్కొన్నారు.. నాజీలు సోవియట్ యూనియన్‌పై ద్రోహపూరితంగా దాడి చేశారు. దేశాన్ని, అపారమైన వనరులను స్వాధీనం చేసుకోవాలని, సంస్కృతిని, చారిత్రక వారసత్వాన్ని పూర్తిగా నాశనం చేయాలని, అంతిమంగా సోవియట్ యూనియన్‌లోని ప్రజలు, జాతులు, జాతి సమూహాలతో సహా మొత్తం సోవియట్ ప్రజలను నిర్మూలించి, బానిసలుగా చేసి, జాతి నిర్మూలన చేయాలని నాజీలు ప్రణాళిక వేశారని గుర్తుచేశారు. దీని కోసం ఐరోపా నలుమూలల నుండి బలగాలను సమీకరించారు. నాజీ వ్యూహకర్తలు పక్కా ప్రణాలిక రూపొందించారు. కానీ ఒక్క విషయాన్ని లెక్కలోకి తీసుకోలేదని, అదే రష్యన్ల స్వభావం, సోవియట్‌ ‌ప్రజల ఆత్మశక్తి అని పుతిన్‌ ‌వివరించారు. ఈ సంవత్సరంతో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్‌పై దాడి చేసి 85 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. మాతృభూమి రక్షణ కోసం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, తమ సొంత ఆధిపత్యం, జాతి వివక్షత, జెనోఫోబియా, ప్రజలను అణచివేయడం వంటి భయంకరమైన పరిణామాలను ఈరోజు గుర్తుచేస్తుందన్నారు. అయితే ప్రపంచ వ్యవస్థలను, ఐక్యరాజ్య సమితి నిబంధనలను పాటించాలని పుతిన్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ ప్రజల సాంస్కృతిక, నాగరిక వైవిధ్యాన్ని, శాంతిని కాపాడాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను, నాజీల దుర్మార్గాలను కీర్తించే ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కోవడం చాలా ముఖ్యమని పుతిన్ అన్నారు. లక్షలాది మంది పౌరుల మరణాలకు, భరించలేని బాధలకు నాజీలే కారణమన్నారు. సోవియట్ పౌరులపై నాజీ నేరస్థులు చేసిన మారణహోమం, అకృత్యాలను సమర్థించడాన్ని నిరోధించాలని పరోక్షంగా అమెరికా, ఉక్రెయిన్‌‌లను ఉద్దేశించి పుతిన్‌ అన్నారు. ఉక్రెయిన్‌లోని రష్యా సైనికులు నాటో దేశాలన్నింటి మద్దతు ఉన్న “దురాక్రమణ శక్తి”తో పోరాడుతున్నారని, తన యుద్ధ లక్ష్యాలు “న్యాయమైనవి” అని తెలిపారు. చివరగా, పుతిన్ విజేతల తరానికి, సత్యం, న్యాయం విజయానికి, దేశాలు, ప్రజల స్నేహం, శ్రేయస్సుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంక్షలు ఉన్నప్పటికీ, యూరప్ అంతటా ప్రజలు సోవియట్ యుద్ధ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పించారు. యుద్ధంలో నాజీలతో పోరాడిన బంధువుల చిత్రాలను ప్రదర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్