test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition12 ఏళ్ల తరువాత రోజా రీ ఎంట్రీ

30 మే, 2026

puli meka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సీనియర్ నటి రోజా 12 ఏళ్ల తర్వాత తమిళ చిత్రసీమలో రీఎంట్రీ ఇచ్చారు. 'లెనిన్ పాండియన్' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 'పులి మేక' టైటిల్‌తో విడుదల కానుంది. డి.డి. బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలో గంగై అమరన్, దర్శన్ గణేశన్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఒక సామాన్య రైతు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాడనే బలమైన సంభాషణతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. రోజా వయసు మళ్లిన మహిళ పాత్రలో కనిపించారు. చట్టం, న్యాయం, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరిగే పోరాటమే ఈ సినిమా కథగా తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్