test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డులు ప్రదానం

30 మే, 2026

awards
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 09:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026’ ప్రదానం ఘనంగా జరిగింది. మహానటుడు నందమూరి తారక రామారావు స్మారకార్థం నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో పలువురు సినీ ప్రముఖులకు నిర్వాహకులు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ భరత్ భూషణ్, ఎపీఎఫ్‌డీసీ డైరెక్టర్, నిర్మాత చడలవాడ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణ, టీఎఫ్‌పీసీ కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, నిర్మాత పుష్కూర్ రామ్‌మోహన్‌రావు, ప్రముఖ నటి ప్రశాంతి, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
కళావేదిక ఎన్టీఆర్ స్మారక కళారత్న అవార్డును నిర్మాత చడలవాడ శ్రీనివాసరావు అందుకోగా, సేవారత్న అవార్డులను ఉప్పల స్వప్న, డాక్టర్ అంచుల పవన్‌కుమార్ అందుకున్నారు. సినీ విభాగంలో ఉత్తమ నటుడిగా ఆది సాయికుమార్, ఉత్తమ వైవిధ్య నటుడిగా ప్రియదర్శి, ఉత్తమ నటిగా శివాని నాగారం, జ్యూరీ ఉత్తమ నటిగా ఆనంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ఎంపిక కాగా, ఉత్తమ నిర్మాతలుగా పుష్కూర్ రామ్‌మోహన్‌రావు, సునీల్ నారంగ్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా లయ సత్కారం పొందారు. ఉత్తమ బాలనటిగా సుకృతి, ఉత్తమ సంభాషణ రచయితగా ప్రసన్న కుమార్ బెజవాడ, ఉత్తమ సంగీత దర్శకుడు (రీ-రికార్డింగ్)గా సురేష్ బొబ్బిలి, ఉత్తమ నేపథ్య గాయనిగా సమీరా భరద్వాజ్, ఉత్తమ పీఆర్‌ఓగా తేజస్వీ సజ్జా అవార్డులను స్వీకరించారు. జ్యూరీ సభ్యులుగా దర్శకులు సాయి రాజేష్, శైలేష్ కొలను, పద్మావతి మల్లాది, అనుపమ్ రెడ్డి, నందమూరి సీమంతిని, నందమూరి రూప హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్