హైదరాబాద్ : తన మనసంతా ` పెద్ది’ దగ్గరే ఉందని టాలీవుడ్ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్, పెద్ది సినిమా దర్శక, నిర్మాతలు, ఇతర నటులు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలుపుతూ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, చూపిన శ్రద్ధను దగ్గర నుండి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం’’ అని రామ్ చరణ్‌ను ప్రశంసించారు. దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీశ్ కిలారు, ఈ చిత్రంలో నటించిన తన మిత్రుడు ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్, తన సోదర సమానుడు జగపతిబాబుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటి జాన్వీ కపూర్, దివ్యేందుతో పాటు సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్ అంటూ చిత్రబృందాన్ని అభినందించారు. ‘పెద్ది’ సాధించిన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
నా మనసంతా `పెద్ది’ దగ్గరే : చిరంజీవి
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)