test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆ వార్తలు అవాస్తవం

5 రోజుల క్రితం

Wall Poster Cinema Production House
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాని తదుపరి ప్రాజెక్ట్‌ను ‘బ్యాండ్ మేళం’ చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ జవ్వాజి కథతో వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సతీష్ చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ వార్తలపై వాల్ పోస్టర్ సినిమాస్ నిర్మాణ సంస్థ స్పందించింది. ‘మా తదుపరి ప్రొడక్షన్ నంబర్ గురించి ప్రస్తుతం నెట్‌లో ప్రచారంలో ఉన్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమైనవి, నిరాధారమైనవి. మా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు మా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే తెలియజేస్తాం. కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయొద్దు.’ అని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్