గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి భానుచందర్, గాయని సునీత, సీ. కళ్యాణ్, రఘుబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఆకాష్ కష్టపడే నటుడని, దర్శకుడు శివ వినోదాత్మక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు. ట్రైలర్ ఆకట్టుకుందని, చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని భానుచందర్ కోరారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. హీరో ఆకాష్, హీరోయిన్ భైరవి ఆర్థ్యా చిత్ర కథ, కథనంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులలు ఆదరించాలని కోరారు.
Print Edition12న ‘కొత్త మలుపు’
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 09:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)