ఇంటర్నెట్ : క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ లుక్స్, ఆమె బరువుపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై సినీనటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్యకు మద్దతుగా నిలుస్తూ ట్రోలర్స్‌కు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫ్యాషన్ అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని, ప్రజల అంచనాలకు తగ్గట్టుగా మహిళలు ప్రవర్తించాల్సిన అవసరం లేదని కంగనా స్పష్టం చేశారు.
కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఐశ్వర్యా రాయ్ క్యాన్స్ ఫొటోను షేర్ చేస్తూ.. “ఫ్యాషన్, స్టైల్ అనేవి ఒకరి స్వీయ వ్యక్తీకరణ. ఇది జీవితం పట్ల, వారి వైఖరి పట్ల వారికున్న వ్యక్తిగత అవగాహన. ఏ మహిళా ఎవరికీ ఏమీ బాకీ లేదు. ఐశ్వర్య చాలా అద్భుతంగా కనిపిస్తోంది” అని ప్రశంసించారు. అంతేకాకుండా, విమర్శలు చేసేవారికి సవాల్ విసురుతూ, “ఆమెను వేరే విధంగా చూడాలనుకునే వారు, మొదట మీరేంటో నిరూపించుకోండి. ఆమె మిమ్మల్ని మెప్పించడానికి ఇక్కడ లేదు. ఆమె ఎప్పటికీ వైభవంగానే ఉంటుంది” అని పేర్కొన్నారు. రెడ్ కార్పెట్ ఈవెంట్లలో పెద్ద వయసు మహిళలపై వస్తున్న విమర్శలను కంగనా తప్పుబట్టారు. వయసు పెరిగిన మహిళలను రెడ్ కార్పెట్‌పై చూడటం అలవాటు లేకపోతే, ఇప్పటికైనా అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ఇటీవల క్యాన్స్ ఫెస్టివల్‌లో అలియా భట్ లుక్స్‌తో ఐశ్వర్యను పోల్చుతూ కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేశారు. అలియా ఫ్యాషన్ చాయిస్‌లను కొందరు ప్రశంసించగా, మరికొందరు ఐశ్వర్యకు మద్దతుగా నిలిచారు. గత రెండు దశాబ్దాలుగా క్యాన్స్ వేదికపై భారతదేశానికి ఐశ్వర్య గర్వకారణంగా ప్రాతినిధ్యం వహిస్తోందని గుర్తుచేశారు.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో మే 12 నుంచి 23 వరకూ సందడిగా జరిగింది. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన ‘లుమినారా’ అనే డీప్ సఫైర్-బ్లూ (నీలిరంగు) గౌన్‌లో ఐశ్వర్య రెడ్ కార్పెట్‌పై నడిచి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. రెండోరోజు వైట్ డ్రెస్‌తో ఫొటోలకు పోజులిచ్చి చూపరులను అలరింపచేశారు.








కామెంట్లు (0)