test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ కు మాతృవియోగం

30 మే, 2026

Star Hero Ajith Kumar Loses Mother
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు : కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ కు మాతృవియోగం కలిగింది. అజిత్‌ తల్లి మోహిని మణి (85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం అజిత్‌ దుబాయ్‌ లో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకుని చెన్నైకు బయలు దేరారని, ఆయన చెన్నైకు చేరుకోగానే అంత్యక్రియలు జరుగుతాయని అజిత్ సన్నిహితులు తెలిపారు. మూడేళ్ల క్రితమే అజిత్‌ తండ్రి మరణించారు. ఆ సమయంలో అజిత్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అజిత్ తల్లి మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీనటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్