test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసల్మాన్ ఖాన్ కు జోడీగా నయనతార

27 మే, 2026

nayan and slaman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కథానాయిక నయనతార తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనుంది. టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘జవాన్’ ద్వారా నయనతార హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె చేసిన స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న తాజా ప్రాజెక్ట్‌లో నయనతార పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. ‘జవాన్’ తరహాలోనే ఇందులో కూడా ఆమె యాక్షన్ ప్రధాన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నయనతార డూప్ లేకుండా, ఫైట్ మాస్టర్ల పర్యవేక్షణలో స్వయంగా యాక్షన్ స్టంట్స్ చేస్తోందని సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్