ప్రముఖ సినీ నటి ఖుష్బూ తన భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ సి, కుమార్తెలు అవంతిక, ఆనందిత, అలాగే కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్‌లతో కలిసి తమిళనాడు సీఎం విజయ్‌ను బుధవారం కలిశారు. తన పెద్ద కుమార్తె అవంతిక వివాహానికి రావాలంటూ విజయ్‌కు స్వయంగా పెళ్లి పత్రికను ఖుష్బూ అందించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఖుష్బూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘విజయ్‌ను చూడటం ఎప్పుడూ మా హృదయాలను గర్వంతో, సంతోషంతో నింపేస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మాపై అదే పాత ప్రేమాభిమానాలను చూపిస్తూ, తనదైన చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించారు. థాంక్యూ మై బ్రదర్… మీ అమూల్యమైన సమయం, ఆశీస్సులు మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చాయి’ అంటూ ఖుష్బూ రాశారు.
Print Editionసీఎం విజయ్ ఇంటికి ఖుష్బూ ఫ్యామిలీ
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)