బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘కాక్‌టెయిల్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. హోమి అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇటలీలోని అందమైన లోకేషన్ల నేపథ్యంలో స్నేహం, ప్రేమతో కూడిన ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతోంది. దినేష్ విజన్, లవ్ రంజన్, ప్రమిత ఆర్. విజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.
Print Edition‘కాక్‌టెయిల్ 2’ ట్రైలర్ విడుదల
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 10:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)