ట్రిపుల్ ఐటిల్లో అంతర్జాతీయ ప్రమాణాలు
పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT-AP)-ఆంధ్రప్రదేశ్-అడ్మిషన్స్2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలచేసింది. ఈ విశ్వవిద్యాలయం (RGUKT)పరిధిలోని నాలుగు ప్రతిష్టాత్మక క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్(ఆరు-సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్స్)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం.విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం (Career Opportunity). గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న విద్యాసంస్థ ఇది. నూజివీడు,ఒంగోలు,శ్రీకాకుళం,ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటిల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంజనీరింగ్ విద్య అందుతోంది. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది.వర్శిటీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.ఆర్ జే యూ కేటీ (ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం 18, 2008 ద్వారా స్థాపించబడింది).
అర్హతలు ఇవీ..
ఆర్జీయూకేటీ లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు కింది అర్హతలను కలిగి ఉండాలి. 2026 లో జరిగిన పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.పదో తరగతి తర్వాత అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు, పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆర్జీయూకేటీలో చేరేందుకు ప్రాధాన్యం ఉంటుంది. కెమికల్, సివిల్,కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ , మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఎఐ, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో పొందు పర్చాం. పదో తరగతి 2026లో ఆంధ్రప్రదేశ్ బోర్డు,సీబీస్ఈ లేదా ఐసీఎస్ఈ నుంచి పాసైన వారు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అర్హులు.అడ్మిషన్ల కోసం www.rgukt.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రవేశాలకు సంబంధించి అర్హత (Eligibility Criteria) ప్రమాణాలు కోసం ఆర్జీయూకేటీ వెబ్ సైట్ లో పొందుపర్చివున్నాయి.

మెరిట్‌కే ప్రాధాన్యత: నాణ్యమైన విద్యను అందిస్తున్న ట్రిపుల్ ఐటిల్లో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు గ్రామీణ,పేద మధ్యతరగతి విద్యార్థులు మక్కువ చూపుతుంటారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించేందుకు2008లో రాష్ట్రప్రభుత్వం ట్రిపుల్‌ఐటిలను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటిల్లో నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిని విద్యార్థులకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తులో అభ్యర్థి మెరిట్ కేటగిరీ వారిచ్చిన ప్రాధాన్యం ప్రకారం క్యాంపస్ కేటాయింపు ఉంటుంది.ఒకసారి క్యాంపస్ కేటాయించిన తర్వాత బదిలీలు అనుమతించబోము.రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ సబ్‌ప్లాన్ క్లాసిఫికేషన్ ప్రకారం సీట్ల భర్తీ ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ.250, బిసీ,ఈడబ్ల్యుఎస్,ఓసీ అభ్యర్థులు రూ.400చెల్లించాల్సివుంది.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు అదనంగా 4శాతం డిప్రె వేషన్ స్కోర్ (24 మా ర్కులు) జోడించి ఎంపిక జాబితా ప్రకటిస్తాం. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక ప్రాంగణాల మధ్య విద్యార్థులకు అంతర్గత బదిలీ అవకాశం లేదు. ఇది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు లభించే గొప్ప వరం.
ఎంపిక పక్రియ ఇలా: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే జరుగుతుంది.ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే, అప్పుడు గణితం, సైన్స్,ఇంగ్లీష్ సబ్జెక్టుల మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారు. అప్పటికీ టై అయితే పుట్టిన తేదీ ప్రకారం ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యమైన తేదీలు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది.దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ దరఖాస్తులు ప్రారంభం మే 1, 2026 ఆఖరు తేదీ (చివరి తేదీ) 30.05.2026. ప్రయివేటు స్కూల్ విద్యార్థులు కూడా మెరిట్ ఆధారంగా పోటీ పడొచ్చు.మొదటి రెండేళ్లు లో సాధించిన మెరిట్ ఆధారంగా బీటెక్ బ్రాంచ్ కేటాయిస్తారు.
ట్యూషన్ ఫీజు: పీయూసీకి ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.45వేలు,ఇంజనీరింగ్‌కు ఏడాదికి రూ.50వేలుగా నిర్ణయించారు. ఆంధ్రేతర రాష్ట్రాల వారికి 25 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అభ్యర్థులు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాల్సివుంది.పీయూసీ తర్వాత ట్రిపుల్‌ఐటి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది.
క్యాంపస్ ల వారీగా సీట్ల కేటాయింపు ఇలా : నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం,ఒంగోలు4,400 (ఒక్కో క్యాంపస్ 1100) సీట్లు. ఇండిగ్రేటేడ్ బీటెక్ కోర్సు ప్రత్యేకతలు ఆర్జీయూకేటీలో విద్యా విధానం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది.ఇక్కడ ఆరేళ్ల సమీకృత విద్యావిధానం అమలులో ఉంది. ఇందులో మొదట రెండేళ్ల ప్రీ-యూనివర్సిటీ కోర్సు (PUC) ఉంటుంది.ఇది ఇంటర్మీడియట్ ఎంపీసీ (MPC)లేదా ఎంబైపీసీ (BiPC) స్ట్రీమ్లకు సమానం. అనంతరం నాలుగేళ్ల బీ.టెక్(B.Tech) ఇంజినీరింగ్ ప్రారంభమవుతుంది. ఇది పూర్తి స్థాయి రెసిడెన్షియల్ క్యాంపస్. విద్యార్థులు క్యాంపస్‌లోనే నివసిస్తూ విద్యను అభ్యసించాలి.కంప్యూటర్ ప్రోగ్రామింగ్ , బేసిక్ టెక్నాలజీ అంశాలను ప్రారంభం నుంచే నేర్పిస్తారు. ఏపీ ఆన్‌లైన్, మీసేవల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన మెరిట్ జాబితాను తయారు చేసి జూన్ రెండోవారం లో మెరిట్ లిస్టు ప్రకటిస్తాం. జూన్ ఆఖరుకు అడ్మిషన్లు కల్పించి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభిస్తాం.

ట్రిపుల్ ఐటీల్లో సౌకర్యాలు: విద్యార్థులకు ఆధునిక ల్యాబ్‌లు,డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, హాస్టల్,గ్రంథాలయం,క్రీడా సదుపాయాలు, విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆయా క్యాంపస్ లలో 25 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నివాసానికి అవసరమైన మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయి.
విద్యా బోధన: పూర్తిగా డిజిటల్ పద్ధతుల్లో ఆన్‌లైన్ విధానంలో డిజిటల్ తరగతి గదుల్లో లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో విద్యాభ్యాసం జరుగుతుంది. మొదటి రెండేళ్లు ఇంటర్‌తో సమానమైన పీయూసీ- 1, పీయూసీ- 2 కోర్సును పూర్తి చేయాలి. తరువాత ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొంది నాలుగేళ్లు చదవాలి. ఒకవేళ మొదటి రెండేళ్ల తరువాత ఇంటర్‌తోనే విద్యార్థి బయటకు వచ్చేందుకు కూడా అవకాశం ఉంది.నిత్యం ఆన్‌లైన్‌లో విద్యాభ్యాసం సాగించే విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ఉదయం వ్యాయామం,యోగా,క్రీడలతో విద్యార్థుల రోజువారీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం క్రీడలు, సంగీతం, నృత్యం వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక విద్యనందించాలనే లక్ష్యంతో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసింది. జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా కోర్సులో మార్పులు చేశాం.
గ్లోబల్ కెరీర్ కు దోహదం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐఐటీ తరహా ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ని స్థాపించింది. ఈ సంస్థ ద్వారా విద్యార్థులు ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సును అభ్యసించి,గ్లోబల్ కెరీర్ వైపు అడుగులు వేయొచ్చు. ఆర్జీయూకేటీ(ట్రిపుల్ ఐటీ) క్యాంపస్ల లో నుంచి దాదాపు ప్రతీ సంవత్సరం ఎంతో మంది విద్యార్థులు గేట్ ర్యాంకులు సాధిస్తున్నారు.

ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి
ఛాన్స్‌లర్(పూర్తి అదనపు బాధ్యతలు),
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక
విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ),
చైర్మన్,రాష్ట్ర ఉన్నత విద్యామండలి








కామెంట్‌లు (0)