test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

03 మే, 2026

schemes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 03, 2026, 11:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజంపేట : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు పేర్కొన్నారు. పార్టీ ఆదేశానుసారం తాను కూడా ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని వారికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు తెలిపారు. ఆదివారం పట్టణం లోని 8వ వార్డు నందు పర్యటిస్తూ ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చమర్తి జగన్ మోహన్ రాజు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని తెలియజేశారు. అంతకు ముందు వార్డు నందు పర్యటిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పథకాల పంపిణీ పై చమర్తి ఆరా తీశారు.
అదేవిధంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గానికీ జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, టీడీపీ మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సి.సుధాకర్, మాజీ పట్టణ అధ్యక్షులు సంజీవరావు, పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు, వార్డు అధ్యక్షులు రవికుమార్ శెట్టి, మున్సిపల్ కౌన్సిలర్లు గుగ్గిళ్ళ చంద్రమౌళి, మీసాల వెంకటసుబ్బయ్య, రాజేష్, మాజీ కౌన్సిలర్లు మనుబోలు వెంకటేశ్వర్లు, మాజీ రాష్ట్ర కార్యదర్శి ఇడిమడకల కుమార్, వార్డు అధ్యక్షులు పీరు సాహెబ్, యువ నాయకులు మహమ్మద్ అలీ, అంజిబాబు, ప్రముఖ డాక్టర్ నవీన్ కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్