ప్రజాశక్తి గణపవరం:వారానికి ఒకసారి బిపి వైద్య పరిక్షలు తప్పనిసరి అని గణపవరం పిహెచ్చ్ సి డాక్టర్ కె ఓంకారనాథ్ తలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా సోమవారం ఆరోగ్యకేంద్రంలో స్థానికులకు రక్తపోటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముపై సంవత్సరాలు పైపడిన ప్రతి ఒక్కరు బిపీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బిపి ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలని, ఆరోగ్యమైన ఆహరం తీసుకోవాలని, వ్యాయామం చేయాలని సూచించారు. తరుచు వైద్యపరిక్షలు చేయించుకోని గుండే సంబందిత వ్యాదులను ముందే గుర్తింవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జాలాది విల్సన్ బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వారానికి ఒకసారి బిపి వైద్య పరిక్షలు తప్పనిసరి : డాక్టర్ ఓంకారనాద్
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)