
ప్రిన్సిపాల్ నిర్మలాకుమారి
ప్రజాశక్తి-గణపవరం : దేశ అభివృద్ధి శాస్ర్తసాంకేతికత కీలకమని గణపవరం డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ పి నిర్మలా కుమారి అన్నారు. సోమవారం జరిగిన జాతీయ సాంకేతిక దినోత్సవం కార్యక్రమంలో పాల్గోని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రియ దృక్పధం, సృజనాత్మకత సాంకేతికపై ఆసక్తిని కలిగించటానికి ఈ కార్యక్రామాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంకేతక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ చిత్రలేఖనం, పవర్ పోయింట్ ప్రజెంటేషన్, ఎలోక్యూషన్ పోటిలు నిర్వహించి గెలుపోందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజి వైస్ ప్రిన్సిపాల్ కె స్వరూపరాణి, లెక్షర్లులు కె గిరిబాబు, శ్రీనివాస్ రావు, సి హెచ్చ్ చైతన్య, షేక్ అన్సారీ, షేక్ పర్వీన్, జి శారద దేవి, ఎం శాంతి, అద్యాపకులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)