ప్రజాశక్తి-విజయనగరం కోట : భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్, జిల్లా యువజన కార్యాలయం, విజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భారత్ కుమార్ ఎన్. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వం (ఫిట్‌నెస్) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.
ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు , భవిష్యత్తులో తలెత్తే ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకుని సైకిల్ వినియోగాన్ని, నడకను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కోచ్‌లు, సెట్రాజ్ ప్రతినిధులు, యువత, క్రీడాకారులు , స్వచ్ఛంద సేవకులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా యువజన కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
విజయనగరంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 11:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)