లేపాక్షి: శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని మానేంపల్లి గ్రామ శివారులో ఉన్న హంద్రీనీవా కాలువలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. కాలువలో మృతదేహంతో పాటు ఒక ద్విచక్ర వాహనం కూడా ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు బైక్‌తో సహా కాలువలో పడిపోయారా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
హంద్రీనీవా కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం
05 ఏప్రిల్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఏప్రి 05, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)