test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మక్కువలో తాగునీటి కష్టాలు ..!

29 మే, 2026

Drinking water problems in Makvu..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 29, 2026, 12:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మండల కేంద్రం మేజర్ పంచాయతీ మక్కువ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. రెండు రోజులగా రక్షిత్ తాగునీరు పథకం ప్రధాన పైపులైను మరమ్మతుకు గురికావడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సుమారు 7500 జనాభా ఉన్న మక్కువకు లక్ష ఇరవై లీటర్ల సామర్థ్యం గల రక్షిత పథకం ట్యాంకులు రెండు నిర్మించారు. ఈ ట్యాంకుల ద్వారా వచ్చే నీటి సరఫరా తగినంతగా లేకపోవడంతో రెండు మూడు సార్లు ట్యాంకులను నింపుకోవాల్సిన పరిస్థితి. సుమారు 20 ఏళ్ల నాటి పైపులైన్లు రెండు కిలోమీటర్లు పొడుగునా ఏర్పాటు కావడంతో తరచూ మరమ్మతుకు గురవుతూనే ఉన్నాయి. గతంలో పంచాయతీ పాలనలో వెంటనే స్పందించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన రావడంతో అధికారులు ఎవరూ  పట్టించుకునే పరిస్థితి లేదనీ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు రక్షిత నీరు అందేలా వెంటనే అధికారులు స్పందించి రక్షిత పైపులైనుకు మరమ్మతులు చేపట్టాలని మేజర్ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్